త్వరలోనే రాకపోకలు
ఖమ్మంఅర్బన్: గత ఏడాది సెప్టెంబర్‌లో మున్నేటికి వచ్చిన వరదతో ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లోని వంతెన దెబ్బతినగా చేపట్టిన మరమ్మతు పనులు చివరి దశకు చేరాయి. సుమారు రూ.కోటితో చేపట్టిన పనులు ముగియనుండడంతో త్వరలోనే రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. మున్నేటి వరదతో బ్రిడ్జి 20పిల్లర్లకు తొమ్మిది పిల్లర్ల వద్ద జాయింట్లు దెబ్బతిన్నాయి. ఒక పిల్లర్ వద్ద వంతెన పలకలు పక్కకు జరిగాయి. దీంతో రాకపోకలు నిలిపేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు విశాఖకు చెందిన నిపుణులైన కార్మికులతో మరమ్మతు చేయిస్తున్నారు. అన్ని పిల్లర్లను పరిశీలిస్తూ యథాస్థానానికి చేర్చి లాక్‌లు అమర్చామని ఆర్‌అండ్‌బీ ఈఈ యుగంధర్ తెలి పారు. అలాగే, కర్ర మొద్దులు శ్లాబ్, పిల్లర్ల మధ్య ఇరుక్కోగా శ్లాబ్ పైకి లేపి వాటిని తొలగించాక మళ్లీ యథాస్థానంలో కూర్చోబెట్టామని వెల్లడించారు.
తుదిదశకు ప్రకాష్‌నగర్ వంతెన
మరమ్మతు పనులు
Comments
Please login to add a commentAdd a comment