రైతులకు మేలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేసింది. ఐకార్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్), ఆచార్య కొండాలక్షణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం సమన్వయంతో కౌటాల మండలం కనికిలో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం పరిశీలించాం. స్థల సేకరణ పూర్తయితే పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ఒక ప్రొఫెసర్, ఆరుగురు శాస్త్రవేతలతో పాటు మొత్తం 16 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. సాంకేతికతను రైతులకు చేరువ చేసి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే కృషి చేస్తారు. కనికి గ్రామంలో కేవీకే ఏర్పాటుకు స్థానిక రైతులు ముందుకొచ్చారు.
– డా. ఎ.శ్రీనివాస్, ప్రొఫెసర్,
కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యానశాఖ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment