ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నిర్వహించే జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. గురువారం ఆలయాన్ని సందర్శించి రోడ్డు మార్గాలను పరిశీలించారు. జాతరకు ఎంతమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి చేరుకునేందుకు అందుబాటులో ఉన్న రోడ్డు మార్గాలపె ఆరా తీశారు. గతంలో తలెత్తిన సమస్యలు, ప్రసుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రెబ్బెన మండల కేంద్రం నుంచి ఆలయానికి వచ్చే ప్రధాన రహదారికి ఇరువైపుల గుంతలు లేకుండా మట్టితో పూడ్చాలన్నారు. ఎక్కడా వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్, ఆలయ చైర్మన్ జయరాం, సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్, నాయకులు తులసీరాం, సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment