‘అమ్మ ఆదర్శ’ పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎంపిక చేసిన ప్రతీ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల నిర్మాణం, విద్యుద్దీకరణ, గదుల మరమ్మతులు చేపట్టాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు మాత్రమే ఎంబీ రికార్డులు పూర్తి చేసి బిల్లులకు సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment