భగీరథ పైపులైన్ పునరుద్ధరణ
● నెల రోజుల తర్వాత 64 గ్రామాలకు తాగునీరు
దహెగాం(సిర్పూర్): కాగజ్‌నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వంతెన వద్ద అధికారులు ఎట్టకేలకు మిషన్ భగీరథ పైపులైన్ పునరుద్ధరించారు. దాదాపు నెల రో జుల తర్వాత 64 గ్రామాలకు తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. అందవెల్లి పెద్దవాగు వంతె న అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు నెల రోజుల క్రి తం ప్రారంభించారు. ఈ క్రమంలో వంతెన పైనుంచి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ తొలగించారు. దహెగాం, కాగజ్‌నగర్, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 14న ‘సాక్షి’లో ‘నెల రోజులుగా భగీరథ బంద్, మళ్లీ ఈ నెల 16న ‘మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు..?’ అంటూ వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. మంగళవారం పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. రాత్రి వరకు భగీరథ తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని ఏఈ సాయికృష్ణ తెలిపారు.
ఎఫెక్ట్
భగీరథ పైపులైన్ పునరుద్ధరణ