ఆక్వా షాపుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
నాగాయలంక: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అధారిటీ (ఏపిఎస్ఎడిఎ) యాక్ట్ అనుసరించి మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా నిషేధిత యాంటీ బయోటిక్ వాడకం నియంత్రించే క్రమంలో టాస్క్ఫోర్స్ కమిటీ అధికారులు గురువారం స్థానికంగా ఉన్న ఆక్వా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అవనిగడ్డ మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు ఆర్.ప్రతిభ, బందరు డ్రగ్ ఇన్స్పెక్టర్ బి.గోపాలకృష్ణ, విజయవాడ ఎంపెడె అధికారి డి.అమర్ సీసీఏ టెక్నికల్ అసిస్టెంట్ డి.నవీన్నాయక్, స్థానిక రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ సనకా జనార్థనరావు తనిఖీలు చేశారు. ఆక్వా ఉత్పత్తులు అన్నింటికి సీఏఏ రిజిస్ట్రేషన్, అలాగే ఆక్వా షాపులకు ఏపీఎస్ఏడీఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని వ్యాపారులకు సూచించారు. కాల పరిమితి చెల్లిన ఆక్వా ఉత్పత్తులను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం నాలుగు షాపులను తనిఖీ చేసిన కమిటీ అధికారులు సంబంధిత వివరాలను మాత్రం వెల్లడించ కుండా గోప్యంగా ఉంచారు. స్థానిక ఫిషరీస్ అసిస్టెంట్ ఎం.జగదీప్, కానిస్టేబుల్ వారి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment