మైలవరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మైలవరం మండలం వెల్వడం అడ్డ రోడ్డు వద్ద జరిగింది. జి.కొండూరుకు చెందిన భార్యాభర్తలు లంకా కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఆగిరిపల్లిలోని తమ మామిడి తోటలను చూసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జి.కొండూరు బయలుదేరారు. మైలవరం మండలం వెల్వడం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొన డంతో కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేక తల్లడిల్లాడు.