డ్రంకన్‌డ్రైవ్‌లో జైలు శిక్ష
నంద్యాల(వ్యవసాయం): మద్యం తాగి వాహనం నడుపుతున్న వారికి సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డిగారి రాంభూపాల్ జైలు శిక్షను ఖరారు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన రంగస్వామి, నంద్యాలకు చెందిన కందమూరి శివకుమార్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లెలో సోమవారం ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దూదేకుల సిద్దిబాషా(13)కు చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో అంకిరెడ్డిపల్లెలో ఉంటున్న పెద్దమ్మ షెకూరిబీనే తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. హెయిర్‌స్టైల్ సరిగా లేదని స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో గ్రామంలోనే సెలూన్ షాపులో ఉదయం కటింగ్ చేయించుకుని ఇంటికి వెళ్లాడు. అయినా కటింగ్ సరిగా లేదని, సరిగా చేయించుకోవాలని పెద్దమ్మ మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. కొద్ది సేపటికి గమనించి ఉరి నుంచి తప్పించి చికిత్స కోసం తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment