● ఐస్‌క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు ఆవిష్కరణ
ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఐస్‌క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు గీచి అబ్బుర పరిచారు. మైక్రో పెన్ను, బ్రష్‌తో పోస్టర్ కలర్స్ ద్వారా ఐస్‌క్రీమ్ పుల్లపై 3 గంటలు శ్రమించి 90 సూక్ష్మ చిత్రాలు వేశారు. చిత్రంలో అడవిలో చెట్లు లేక వన్యప్రాణులు అలమటించిపోయే వేదన, వారి వేదనను వనదేవతకు మొరపెట్టుకోవడం, వన దేవత కన్నీరు పెట్టడం, చెట్లు, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతుండటం, ఎండిపోయిన చెట్లు, జంతు కళేబరాలు, నరికివేసిన చెట్లు, తదితరాలతో పాటు జంతువులు, ఖడ్గమృగాలు, నెమళ్లు, కొంగలు, పక్షులు, చేపలు, తాబేళ్లు, తదితర వన్యప్రాణులను సూక్ష్మ చిత్రాల్లో చూపించారు. – నంద్యాల(అర్బన్)