కర్నూలు మార్కెట్‌లో వరి ధాన్యం క్రయవిక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు శుక్రవారం పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ సదుపాయం లేదు. దళారీలకు, మిల్లులకు తీసుకెళ్లి అమ్మకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కర్నూలు మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్‌కు మొదటి రోజు ఇద్దరు రైతులు మాత్రమే 23 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. క్వింటాకు రూ.2,529 ధర లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి ధాన్యం క్రయవిక్రయాలు రెగ్యులర్‌గా చేపడతామని జేడీ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment