
పొలంలో అనుమానాస్పద మృతి
ఆస్పరి: దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన ఉప్పర ఉమాపతి (30) అనే వ్యక్తి ములుగుందం నుంచి ఆగ్రహారం వెళ్లే రోడ్డు పక్కన ఉన్న పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పరి సీఐ మస్తాన్‌వలి తెలిపిన వివరాలు మేరకు.. తెర్నేకల్లుకు చెందిన ఉప్పర ఉమాపతి ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈయనకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ములుగుందం నుంచి ఆగ్రహారం వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉమాపతి మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు నుంచి క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ఉమాపతికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
హాస్టల్ విద్యార్థి నిజాయితీ
వెల్దుర్తి: తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను ఓ హాస్టల్ విద్యార్థి వార్డెన్‌ను అందించి నిజాయతీ చాటుకున్నాడు. వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఆదివారం ఉదయం విద్యార్థులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్‌తోపాటు చుట్టుపక్కల ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా 8వ తరగతి చదువుతున్న శాంతిరాజుకు సెల్‌ఫోన్ కనబడింది. నిజాయతీతో సెల్‌ఫోన్‌ను తమ వార్డెన్ ఉస్మాన్ బాషాకు అప్పగించాడు. విద్యార్థిని అభినందించిన వార్డెన్.. సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్ల ద్వారా యజమాని విజయ్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. గుంటూరు కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో గిద్దలూరుకు నుంచి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వెళ్తుండగా సెలఫోన్‌ను పోగొట్టుకున్నామని తెలిపారు. కొరియర్ ద్వారా సెల్‌ఫోన్‌ను పంపనున్నట్లు విజయకుమార్‌కు వార్డెన్ చెప్పారు.

పొలంలో అనుమానాస్పద మృతి