మహబూబాబాద్ అర్బన్: అజాగ్రత్త, అతివేగం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాయాలపాౖలైన వారు మంచానికే పరిమి తమవుతున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తున్న యువకులు మాత్రం వాహనాల వేగం తగ్గించడం లేదు. తీరా చూస్తే వారి కుటుంబాలను రోదనలోకి నెట్టేలా చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జనవరి మాసంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వ హిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు రవాణా శాఖ, పోలీసుశాఖ అధికారులు ప్రజలు, ద్విచక్రవాహనదారులు, ఆటో, కారు, లారీ, ఇతర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ నెల 31 వరకు..
జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ప్రతీరోజు ఒక మండల కేంద్రంలోని పలు జంక్షన్లు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి(శుక్రవారం)తో ఈ కార్యక్రమం ముగియనుంది. కాగా మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపితే చట్టరీత్యా తీసుకునే నేరాలపై వివరిస్తున్నారు. ద్విచక్రవాహనదారులు, ఆటో, కారు, ఇతర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా రవాణాశాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వీరితో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా భాగస్వామ్యమై ప్రజలకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు, ప్రమాదాలపై అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నేటితో ముగియనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment