ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థినికి అస్వస్థత
కేసముద్రం: ఫుడ్‌పాయిజన్‌తో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రంస్టేషన్‌లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో హలావత్ సంజన ఆరో తరగతి చదువుతోంది. కాగా హాస్టల్‌లో పెట్టిన జీరారైస్ తింటుండగా పురుగులు కనిపించాయి. అయితే అప్పటికే తినడం పూర్తి చేసిన ఆ విద్యార్థినికి ఈ నెల 28న వాంతులు కాగా.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి తగ్గకపోవడంతో విద్యార్థిని ఆమె తండ్రికి అప్పగించారు. ఈ క్రమంలో సంజనకు వాంతులతోపాటు, విరేచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను గురువారం మానుకోట జనరల్ ఆ స్పత్రికి తరలించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా తనతోపాటు మరికొందరు విద్యార్థినులు జీరారైస్ తిన్నారని, వారికి కూడా ఫుడ్‌పాయిజన్ అయినట్లు విద్యార్థిని చెప్పింది. ఈ ఘటనపై ప్రిన్సి పాల్ సుజాతను వివరణ కోరగా.. హాస్టల్‌లో ఎలా ంటి పుడ్‌పాయిజన్ కాలేదని, సంజన అనే విద్యార్థినికి మాత్రమే వాంతులు కావడంతో ఆమె తండ్రి హాస్టల్ నుంచి తీసుకెళ్లాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment