కుష్ఠు నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి
తొర్రూరు: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనకు డీపీఎంఓ వనాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యులు మీరాజ్, జ్వలత, మానస, నందన, సబ్బంది బాలాజీ, మంగమ్మ, సందరి, కమల, మేరీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ జి.మురళీధర్ అన్నారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ రెండో బ్యాచ్‌కు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ... స్పర్శలేని, మొద్దుబారిన మచ్చలను గుర్తించినట్లయితే వెంటనే స్థానిక పీహెచ్‌సీలో వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, ట్రైనింగ్ డాక్టర్ సౌజన్య, బిజినెస్ మేనేజర్ ప్రశాంత్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ లవరం, వాల్య, నరసింహాస్వామి, సబ్ యూనిట్ ఆఫీసర్ ఓబిలిశెట్టి రామకృష్ణ, డీఈఓ ఉమాకర్, అరుణ్, శ్రీనివాస్, ఐలయ్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment