నిబంధనలు ఇవే.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఇవే..

Published Fri, Jan 31 2025 1:47 AM | Last Updated on Fri, Jan 31 2025 1:47 AM

నిబంధనలు ఇవే..

నిబంధనలు ఇవే..

● ఎవరైనా వాహనాలు నడపాలంటే రిజిస్ట్రేషన్‌ సిర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫి కెట్‌,ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అని జి ల్లా రవాణాశాఖ అధికారులు తెలుపుతున్నారు.

● రిజిస్ట్రేషన్‌ లేకపోతే వాహన చట్టం సెక్షన్‌ 36, 192 ప్రకారం జరిమానా విధిస్తారు.

● డ్రై వింగ్‌ లైసెన్స్‌ లేకపోతే సెక్షన్‌ 3,4,180, 181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు.

● పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే సెక్షన్‌ 190(2) ప్రకారం జరిమానా రూ. 1000 విధిస్తారు.

● ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ లేకపోతే సెక్షన్‌ 196(ఏ) ప్రకారం మూడు నెలలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తారు.

● మద్యం తాగి వాహనం నడిపితే సెక్షన్‌ 185 ప్ర కారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు.

● ర్యాష్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ నేరంగా పరిగణిస్తారు. మోటార్‌ వాహన చట్టం ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా విధిస్తారు.

● పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులకు ఎ క్కించుకొని వెళ్తే మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకా రం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు.

● సీట్‌ బెల్ట్‌ ధరించకపోతే సీఎంవీ రూల్‌ 138(3), సెక్షన్‌ 177 ప్రకారం జరిమానా రూ.1000 విధిస్తారు.

● సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపితే రూ. 1000 జరిమానా, డైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా నిలిపివేస్తారు.

● హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement