వేలికి సిరా.. తప్పిదాలకు తెర | Sakshi
Sakshi News home page

వేలికి సిరా.. తప్పిదాలకు తెర

Published Thu, May 9 2024 4:50 AM

వేలికి సిరా..  తప్పిదాలకు తెర

పాలమూరు: ఈనెల 13న పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయగానే ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా రాస్తారు. చర్మంపై పూసి ఈ సిరాను త్వరగా తొలగించడానికి సాధ్యపడదు. వేలుపై పూసిన సిరా కాంతికి గురై 15–30సెకన్లలో పొడి బారుతుంది. చర్మాన్ని శుభ్రం చేసినప్పుడు కొద్దికొద్దిగా చెదిరిపోతుంది. కొంత కాలం వరకు వేలికి సిరా ఉంటుంది. ఎన్నికలకు వినియోగించే సిరా 10శాతం, 14–18 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ద్రావణం మిలితమై ఉంటుంది. సిరాలోని సిల్వర్‌ నైట్రేట్‌తో సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. కర్ణాటక ప్రభుత్వ రంగంలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌, హైదరాబాద్‌ లోని ఓ ల్యాబ్‌లో ఈ సిరాను తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద ఈ సిరా ఉత్పత్తికి 1962లోనే ఆయా సంస్థలు హక్కులు పొందాయి. 1976నుంచి మరో 28 దేశాలకు ఈ సంస్థ సిరాను సరఫరా చేస్తోంది. ఒకరు ఓటు వేసిన తర్వాత తిరిగి పోలింగ్‌ బూత్‌కు వచ్చే పరిస్థితి ఏర్పడదు.

Advertisement
 
Advertisement