భీమారం/కాసిపేట: తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని టీజీబీ చైర్‌పర్సన్ శోభ అన్నారు. గురువారం భీమారం, కాసిపేట మండలం కొండపూర్ యాపలో బ్యాంకు బ్రాంచిలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అధికంగా వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. మంచిర్యాల రీజనల్ మేనేజర్ మురళీధర్‌రావు, చీఫ్ మేనేజర్ రవికిషోర్, భీమారం బ్రాంచి మేనేజర్ సతీష్ పాల్గొన్నారు.