● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్: మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మెప్మా పీడీ మారుతిప్రసాద్‌లతో కలిసి ఏపీఎంలు, మండల సమాఖ్య నాయకులు, కార్యదర్శులు, స భ్యులు, ఆర్పీలు, సీవోలు, టీఎంసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బ లోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపా రు. సూక్ష్మ పరిశ్రమల క్రింద 5,684 యూనిట్లు ప్రతి పాదించగా 90శాతం గ్రౌండింగ్ చేసినట్లు తెలిపా రు. మొబైల్‌ఫిష్, మిల్క్‌పార్లర్లు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం విభాగాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలి పారు. అనంతరం సీ్త్రనిధి పథకంలో మందమర్రి టౌన్ లెవల్ ఫెడరేషన్ సంస్థ రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచినందున సంస్థ సభ్యులకు అవార్డు అందజేశారు.
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాశాఖ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. అలింకో సంస్థ ద్వారా రూ. 17.50లక్షల విలువైన వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, సీపీ చైర్లు మొత్తం 215 ఉపకరణాలు 85 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, ఎంఈవో మాలవీదేవి, సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, యశోధర, శ్రీనివాస్, ఏఎస్‌వో రాజుకుమార్, డీఎస్‌వో మధుబాబు, అలింకో ప్రతినిధులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, రిషిగుప్తా, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.