● ఇసుక అక్రమ రవాణాపై దృష్టి ● నిరంతరం కలెక్టర్, అధికారుల పర్యవేక్షణ ● ఇదే తీరుగా ఉంటే అక్రమాలకు అడ్డుకట్ట
● ప్రయాణికులకు ఇబ్బందులు కలుగొద్దు ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఇసుక క్వారీల్లో తనిఖీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇసుక అక్రమ రవా ణాను అరికట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రస్థాయి నుంచి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలనే ఆదేశాలు రావడంతో ఆ మేరకు జిల్లాలోని క్వారీలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో దావరి ఇసుక అమ్మకాల్లో అవకతవకల నివారణకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కుమా ర్ దీపక్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్వారీల వద్దకు వెళ్లి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. క్వారీల్లో ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌తోపాటు ఉన్నతాధికారులు సైతం పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేయడం, అధికారులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేయడంతో అక్రమ దందా నిలిచిపోయింది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతోపాటు కార్పొరేషన్, మైనింగ్, స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వారికే బరువు సరి చేస్తున్నారు. అధికంగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కోటపల్లి మండలం కొల్లూరు, పలుగుల ఎర్రాయిపేట పరిధిలో ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. శుక్రవారం రెండు స్టాక్ యార్డుల నుంచి 155ఆర్డర్లు రాగా, 4,940క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరిగాయి.
ఆగినట్లేనా?
ఇసుక రవాణాపై కలెక్టర్ కుమార్ దీపక్ నిత్యం అ ధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రెండు రో జుల క్రితం ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోందని ఓ యువకుడు వీడియో తీయగా, వెంట నే అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులతో తనిఖీలు చేశారు. గతంలో నిర్ధేశిత ఇసుక కన్నా అదనంగా బకెట్‌తో లారీల్లో వేస్తూ అదనంగా సొ మ్ము చేసుకునే వారు. రోజువారీగా నిత్యం వంద ల లారీలు వస్తుండేవి. అంతేగాక రాత్రివేళ ఎలాంటి తనిఖీలు లేకుండా ఇసుక జిల్లా దాటేది. చెక్‌పోస్టులు, పోలీసుస్టేషన్ల నుంచి అడ్డు చెప్పకపోవడంతో దందా నడిచింది. జైపూర్, చెన్నూరు, కోట పల్లి మండలాల పరిధిలో రాజకీయ పలుకుబడి, ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టడంతో అంతా సైలెంట్‌గా వ్యవహారం నడిచేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రా గానే పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం వేస వి ప్రారంభం కావడంతో ప్రస్తుతం రోజుకు వందకు పైగానే ఇసుక బుకింగ్ జరుగుతున్నాయి. గతంలో మాదిరి అక్రమాలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు ఇసుక దందాకు అడ్డు చెప్పకుండా ఓ ప్రజాప్రతినిధితో చెప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. స్థానికులకు గోదావరి నుంచి ఇసుక తీసునేందు కు అనుమతి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కోటపల్లి: ఇసుక రవాణాలో అక్రమాలు, లోటుపాట్లు లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని కొల్లూర్, ఎర్రాయిపేట ఇసుక క్వారీలను డీసీపీ భాస్కర్‌తో కలిసి తనిఖీ చేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక క్వారీలకు వచ్చే లారీల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక లోడింగ్ ఆలస్యం కారణంగా జాతీయ రహదారిపై లారీలు నిలి చిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, లోడింగ్‌లో వేగం పెంచాలని, ఇసుక క్వారీల సామర్థ్యం త్వరలో పెంచుతామని తెలి పారు. రోజుకు 200వరకు లారీలు లోడింగ్ అ య్యేలా చూడాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టు కూడా రద్దు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం కోటపల్లి తహసీల్దార్ కార్యాల యం, ఎస్సీ హాస్టల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, డాక్టర్ అరుణశ్రీ, డిప్యూటీ తహసీల్ధార్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చెన్నూర్: ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం, మండలంలోని పొక్కూర్, చెల్లాయిపేట, సుందరశాల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పథకంలో నిర్మిస్తున్న గదులు, భోజనశాల, వంట గదులు పరిశీలించారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, కస్తూర్బా పాఠశాల ప్రతేకాధికారి సుమలత పాల్గొన్నారు.
కొల్లూరు క్వారీలో లారీలోని ఇసుకను తూకం సరి చేస్తున్న సిబ్బంది
అక్రమాలు లేకుండా సరఫరా
అక్రమాలు లేకుండా సరఫరా