
విశ్వావసు విజయం అందించాలి
అందరి జీవితాల్లో
ఆనందం నిండాలి
మంచిర్యాలటౌన్: కొత్త సంవత్సరంలో ప్రజల కు శుభం కలగాలని, అందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శ్రీవిశ్వావసు నామసంవత్సర ఉగా ది పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్, డీఎఫ్‌వో ఆశిష్‌సింగ్, పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరికి ఉగాది పచ్చడిని అందించిన అనంతరం పంచాంగ శ్రవణం చేశారు.
తెలుగు సంవత్సరాది.. విశ్వావసు నామ ఉగాది వేడుకను జిల్లా వాసులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. వేకువ జాము నుంచే ఊరూరా, వాడ వాడలా పండుగ సందడి కనిపించింది. ఇళ్ల గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. అభ్యంగన స్నానం చేసి ఆలయాలకు వెళ్లారు. దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆరగించారు. పంచాంగ ఫలాలు తెలుసుకున్నారు. నూతన వాహనాలకు పూజ చేయించుకున్నారు. గ్రామాల్లో పెద్దలు, అర్చకులు పంచాంగశ్రవణం చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఉగాది పచ్చడి పంపిణీ చేశాయి. గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
– మంచిర్యాలఅర్బన్
చెన్నూర్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

విశ్వావసు విజయం అందించాలి

విశ్వావసు విజయం అందించాలి

విశ్వావసు విజయం అందించాలి

విశ్వావసు విజయం అందించాలి

విశ్వావసు విజయం అందించాలి