
‘శిఖర’ ఉగాది పురస్కారాలు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శిఖర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. పట్టణంలోని శ్రీమంజునాథ గార్డెన్‌లో నిర్వహించిన ఈ కా ర్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారి, వయోజనవిద్య జిల్లా అధికారి పురుషోత్తం నాయక్ హా జరై పురస్కారాలు అందజేశారు. శిఖర ఆధ్వర్యంలో ఏటా వివిధ రంగాల్లో రాణించిన పది మందిని గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పంచముఖి హనుమాన్ టెంపుల్ అర్చకుడు డింగరి కృష్ణకాంతచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.