
బంజారా దీక్షభూమి చేరిన శోభాయాత్ర
నార్నూర్: సేవాలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన భక్తులతో మండలంలోని కొత్తపల్లి హెచ్ జాతీయ బంజారా దీక్ష భూమి సోమవారం జనసంద్రమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సేవాలాల్ భక్తులు వేలాది సంఖ్యలో దీక్ష భూమికి తరలివచ్చారు. శ్రీరామనవమి రోజున మహారాష్ట్రలోని పౌరదేవి పుణ్యక్షేత్రానికి వెళ్లి జగదంబ దేవి, శ్రీ సంత్ రామారావు మహారాజ్ దర్శ నం అనంతరం మాల ధరించిన భక్తులు దీక్షలు విరమిస్తారు. జాతీయ బంజారా దీక్ష భూమి వద్ద శోభా యాత్రను దీక్ష గురువు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రారంభించారు. పాదయాత్ర మహారాష్ట్రలోని పౌరదేవి పుణ్యక్షేత్రానికి శ్రీరామనవమి రోజున చేరుకుంటుందని దీక్ష గురువు తెలిపారు.