
● పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కేంద్రాలు ● అకాల వర్షాల
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో ఇప్పటికే దిగుబడి వచ్చిన రైతులు వడ్లు ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కోతలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు కురిస్తే ధాన్యం నీటి పాలవుతుందని కొందరు క్వింటాల్‌కు రూ.1750 నుంచి రూ.1850 ధరతో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ముందుగా సాగు చేసిన జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో వరి కోతకు వస్తోంది. ఇప్పటికే వరికోతలు పూర్తయిన వారు కేంద్రాలకు తరలించి ఎదురుచూస్తున్నారు. మబ్బులు కమ్ముకుని అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో ఉదయం ఆరబోసి సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు అధికారులు ఈ నెల 10న ప్రకటించినా కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమయ్యాయి.
రెట్టింపు సేకరణ లక్ష్యం..
గతేడాది యాసంగిలో 1.08లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరించారు. ఈ ఏడాది జిల్లాలో 1,21,702 ఎకరాల్లో వరి సాగు కాగా, 3,41,795 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాది కంటే రెట్టింపు 3,31,935 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఏజెన్సీల ద్వారా 321 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా..ఇప్పటివరకు జన్నారం, లక్సెట్టిపేట, కోటపల్లి మండలాల్లో 20వరకు ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరిలో నాట్లు వేసిన పంట పొట్ట, గొలక దశలో ఉంది. నెలాఖరు వరకు ఒకేసారి పెద్దయెత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈలోగా పూర్తి స్థాయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎప్పటికప్పుడు ధాన్యం తరలిస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. గత ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి నీటి పాలైంది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తే ఇబ్బందులు ఉండవని రైతులు కోరుతున్నారు.
ఆలస్యం చేయొద్దు
రెండు రోజులుగా మబ్బులు పడుతున్నాయి. ఈదురు గాలులు, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఽహర్వేస్టింగ్ చేసి కొ నుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసుకు న్న. ఇప్పుడు భారీ వర్షం వస్తే పంట వరద పాలవుతుందని భయంగా ఉంది. ఆలస్యం చేయకుండా సెంటర్ ఓపెన్ చేయాలి.
– ఎం.వెంకటేష్, గ్రామం : నమ్నూర్,
మండలం : హాజీపూర్
తక్కువ ధరకే అమ్ముకున్నా..
ఓ దిక్కు మూడు రోజుల నుంచి మబ్బులు పడుతున్నాయి. సెంటర్లు ఇంకా ఒపెన్ కాలేదు. పది రోజు ల కిందట నుంచి పంట కోతకు వచ్చింది. కొనుగో లు కేంద్రాలు ప్రారంభం కా లేదు. ఎక్కడ నీటి పాలువుతుందోనని రైస్‌మి ల్లు వద్దనే క్వింటాల్‌కు రూ.1850 ధరతో అ మ్ముకున్నా. ఈ ధర తక్కువే అయినా ఆలస్యమై తే వర్షానికి తడిసి నష్టపోవాల్సి వస్తుందని అమ్ముకోక తప్పలేదు.
– కొట్టె బుచ్చయ్య, గ్రామం : కర్ణమామిడి,
మండలం : హాజీపూర్

● పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కేంద్రాలు ● అకాల వర్షాల