పెంబి: మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల మేరకు మండలంలోని వేణునగర్ గ్రామానికి చెందిన ఆత్రం నాగోరావు (37) సోమవారం ఉదయం మందపల్లి గ్రామ శివారులో గల తన మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.
విద్యుత్ మోటార్ ఆన్‌చేసే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు చేనుకు వెళ్లి చూడగా చనిపోయి ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతునికి భార్య సురేఖ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.