
ప్రజలు భయాందోళన చెందవద్దు
తాంసి: భీంపూర్ మండలంలోని రాజ్‌ఘడ్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఎక్కడ చిరుతపులి సంచరించినట్లు ఆనవాళ్లు లేవని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మోపత్‌రావు అన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన రైతు తుకారాం పంటచేలకు వెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో రైతుపై చిరుతపులి దాడిచేసి గాయపర్చినట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. సోమవారం అధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామస్తులతో కలిసి రైతుపై దాడిచేసిన స్థలాన్ని పరిశీలించారు. చిరుతపులి సంచరించినట్లు ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. రైతుపై అటవీ జంతువు ఏదైనా దాడి చేసి ఉండవచ్చవని భావిస్తున్నామన్నారు. రైతులు చేలకు వెళ్లేటప్పుడు చప్పుడు చేస్తూ వెళ్లాలని సూచించారు. వారి వెంట బీట్ అధికారి సాయి కుమార్, గోపాల్, సిబ్బంది కృష్ణ, సోనేరావు ఉన్నారు.
కళతప్పిన అడవులు
జన్నారం: పచ్చదనంతో పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్న అడవులు కళ తప్పాయి. వేసవికాలంలో చెట్ల ఆకులు రాలిపోవడంతో అడవి మొత్తం కళావిహీనంగా మారింది. జన్నారం అటవీ డివిజన్‌లోని మల్యాల వాచ్ టవర్ ఎక్కి చూస్తే అడవి మొత్తం మోడువారి కనిపించింది. ఈ దృశ్యాన్ని అటవీ అధికారులు కెమెరాల్లో బంధించారు.

ప్రజలు భయాందోళన చెందవద్దు