
సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో స్టేట్‌ఫస్ట్
ఖానాపూర్: సైనిక్ స్కూల్‌లో ఆరోతరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్షలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన నస్పూరి వెంకటేశ్వర్ రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన గంగామణి, సంతోశ్ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్ కడెం మండలంలోని లింగాపూర్‌లో గల శాంతినికేతన్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. గ్రామస్తులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
3న పండ్ల తోటలకు వేలం
ఉట్నూర్‌రూరల్: కుమురంభీం జిల్లా కాగజ్‌నగ ర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడితోటలకు ఏప్రిల్ 3న వేలం వేయనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. తోటలో బంగిన పల్లి, దసేరీ, తోతాపరి, రసాలు, హిమాయత్ లాంగ్ర వంటి మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయన్నారు. 2025 నుంచి 2027 పంట కాలానికి కలిపి ఈ పండ్ల తోటల వేలం జరుగుతున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు రూ.10 వేల ధరా వ త్ సొమ్ముతో ఏప్రిల్ 3న ఉదయం 11గంటలకు జంబుగా ఉద్యాన నర్సరీ లో జరిగే వేలంలో పాల్గొనాలని సూచించారు. వివరాల కు 8897478825 సంప్రదించాలని కోరారు.
ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రం నుండి తుంగెడకు వెళ్తున్న ఆటో బోల్తాపడటంతో ముగ్గురికి తీవ్ర, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. జుమ్మిడి శ్రీనివాస్ తన ఆటోలో సోమవారం రెబ్బెన నుండి తుంగెడకు ప్రయాణికులతో బయలుదేరాడు. మార్గమధ్యలో ముందు టైర్ పేలడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న తుంగెడకు చెందిన జుమ్మిడి రవీందర్, జుమ్మిడి ల చ్చుంబాయి, జుమ్మిడి రాజుబాయిలకు తీవ్రంగా జుమ్మిడి సంతోష్, జుమ్మిడి శ్యాంరావ్, జుమ్మిడి విజయలక్ష్మి, జుమ్మిడి శ్రీనివాస్‌లకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను రెబ్బెన పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం బెల్లంపల్లికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు.