
గ్రూప్–1లో 434వ ర్యాంక్
మంచిర్యాలటౌన్: పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న నిర్మలాదేవి, వైద్య రవీంద్రనాథ్ దంపతుల చిన్న కుమారుడు వైద్య సాయి వివేక్‌నాథ్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 434వ ర్యాంక్ సాధించాడు. బెంగళూరులో పోస్టల్ అసిస్టెంట్‌గా చేస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేరయ్యాడు. తల్లి భీమిని మండలం వీగాం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తండ్రి లక్సెట్టిపేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగానే మృతి చెందాడు. తండ్రి ఆశయాల మేరకు చదువులో రాణిస్తూ ఎన్‌ఐటీ నాగ్‌పూర్‌లో బీటెక్ చదివాడు. సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ కంప్లీట్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేరయ్యాడు. బీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు, ఓవరాల్‌గా 434వ ర్యాంకు సాధించాడు.