
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద్రమోహన్
మంచిర్యాలటౌన్: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల హోటల్ క్లేరియన్‌లో నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది ఓటర్లు పాల్గొనగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉదారి చంద్రమోహన్‌గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర అసోసియేట్ సెక్రెటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ గెలుపొందారు.
ఆర్టీసీ ఆర్‌ఎంకు పదోన్నతి
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ ఆర్టీసీ రీజి న ల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సోలోమన్‌కు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా పదో న్నతి కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. అ యితే ఆదిలాబాద్ ఆర్‌ఎంగా ఇంకా ఎవరినీ ని యమించలేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తె లుస్తోంది. కాగా ఈ పదోన్నతి రావడంపై ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సెల్‌ఫోన్ దొంగ రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని అంబేద్కర్‌చౌక్ సమీపంలో గల రేణుక హోటల్‌లో పనిచేసే గెడం వినోద్ సెల్‌ఫోన్‌ను మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన జాదవ్ ప్రవీణ్ దొంగిలించాడు. మంగళవారం వినాయక్ చౌక్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి జాదవ్ ప్రవీణ్ పారిపోతుండడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించగా సెల్‌ఫోన్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.