
వేలాడే తీగలు.. కర్రలే స్తంభాలు
విద్యుత్ వ్యవస్థ గాడిన పెడుతున్నామని అధికారులు చెబుతున్నారు. చేలల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు. కానీ, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. సారంగాపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. హార్వెస్టర్లకు విద్యుత్ తీగలు ఇబ్బందిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇలా కర్రలతో స్తంభాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలంలోని చించోలి(బి), దేవితండా, రవీంద్రనగర్ తండాలకు వెళ్లే దారిలో ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రైతుల పొలాల్లో మిడిల్ పోల్స్ వేశామని, వేస్తున్నామని చెబుతున్నారు. – సారంగపూర్

వేలాడే తీగలు.. కర్రలే స్తంభాలు