
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన చాకపురం లచ్చన్న (72), చందాల రమేశ్, లక్ష్మణ్ మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. లచ్చన్న, రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈఎంటీ సాగర్, పైలట్ మహేష్ క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లచ్చన్న మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.