
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
తాండూర్: తన కంటిచూపు నయమవుతుందో లేదోననే బెంగతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ తంగళ్లపల్లి గ్రామానికి చెందిన గోవిందుల కవిత– సత్యనారాయణల పెద్ద కుమారుడు రవితేజ (23) హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు కంటి సమస్య తగ్గిపోతుందో లేదోనని మానసికంగా వేధనకు గురై బుధవారం మధ్యాహ్నం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండడంతో హుటా హుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే రవితేజ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. యువకుడి మేనమామ అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.