
ప్లాట్ల పంపిణీకి కృషి
కాసిపేట: నిర్వాసితులకు పది రోజుల్లో పునరావాస కాలనీలో ప్లాట్ల పంపిణీతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ డబ్బులు చెల్లించేలా కృషి చేస్తామని బెల్లంపల్లి ఆర్‌డీవో హరికృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని ఓపెన్‌కాస్టు నిర్వాసిత దుబ్బగూడెం గ్రామస్తులతో సింగరేణి అధికారులతో కలిసి పునరావాస కాలనీలో సమావేశం నిర్వహించారు. కాలనీలో జరుగుతున్న పనుల్లో జాప్యం ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులతో సంబంధం లేకుండా ఈనెల 11న ప్లాట్ల కేటాయింపు అనంతరం నిర్వాసితులు నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. ఎస్‌ఓటూ జీఎం విజయప్రసాద్, సివిల్ ఎస్‌ఈ రాము, ఎస్టేట్ అధికారిణి నవనీత, దుబ్బగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.