
రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర
నార్నూర్: రాజ్యాంగ పరిరక్షణకే జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం మండలంలోని పూసిగూడ గ్రామం నుంచి జిల్లా కోఆర్డినేటర్ ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రజలతో, కార్యకర్తలతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లోఖండే దేవురావు, మాజీ సర్పంచ్ బానోత్ గజానందు నాయక్, మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్, మహిళ నాయకురాలు బానోత్ ప్రణీత, పీఏసీఎస్ డైరెక్టర్ కాంతారావు దుర్గే, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కోరేళ్ల మహేందర్, కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు నసీర్ తదితరులు ఉన్నారు.