
కొరవడిన పర్యవేక్షణ!
● అటవీ చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు ● తూతూ మంత్రంగా ఉన్నతాధికారుల పరిశీలన ● విధుల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న సిబ్బంది
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో స్మగ్లింగ్ నిరోధించేందుకు, అధికారుల పనితీరు పర్యవేక్షించేందుకు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు తూతూ మంత్రంగా మారాయి. సీసీకెమెరాల నిర్వహణ చేపడుతున్నా ఉన్నతాధికారులు సీసీఫుటేజీలను పర్యవేక్షించకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది సంతకం చేసిన తర్వాత అక్కడే 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ సంతకం చేసిన తర్వాత తమ సొంత పనుల కోసం వెళ్తున్నట్లు సమాచారం ఉంది. చెక్‌పోస్టుల వద్ద బీ ట్, సెక్షన్ అధికారులతో పాటు వాచర్లు కూడా విధులు నిర్వహిస్తుంటారు. అయితే వాచర్లకు బాధ్యతలు అప్పగించి అక్కడ డ్యూటీ చేసే ఇతర సిబ్బంది సొంత పనుల కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు చెక్‌పోస్టుల్లో జరుగుతుండగా ఇటీవల ఉన్నతాధికారి గమనించి హెచ్చరించినట్లుగా సమాచా రం. గతంలో పని చేసిన ఎఫ్‌డీవో మాధవరావు సీసీ కెమెరాల్లోనే సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు పరి శీలిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఎలాంటి ని ర్లక్ష్యం జరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారులు సీసీకెమెరాలను పట్టించుకోకపోవడంతో సిబ్బంది పై పర్యవేక్షణ లేక ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
మూడేళ్ల క్రితం ఏర్పాటు..
జన్నారం అటవీ డివిజన్‌లో స్మగ్లింగ్ నిరోధించేందుకు, అధికారుల పనితీరు పర్యవేక్షించేందుకు మూడేళ్ల క్రితం చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల ఏర్పాటుతో చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న వాహనాల తనిఖీలు, రాత్రిపూట వాహనాల ప్రవేశంతో పాటు చెక్‌పోస్టుల వద్ద పని చేస్తున్న సిబ్బంది పనితీరు పర్యవేక్షించేవారు. డివిజన్‌లోని ఇందన్‌పల్లి, కలమడుగు, తపాలపూర్ చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు.
ఎన్నో ప్రయోజనాలు..
ప్రధాన రహదారిపై గల అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధాన రహదారిపై స్మగ్లింగ్‌కు తగ్గిపోవడంత పాటు అనుమానిత వాహనాలను గుర్తించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో ఈ సీసీ కెమెరాలు సహకరిస్తాయి. ఇప్పటి వరకు పలు కేసుల పరిష్కారంలో పోలీసులు అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించారు.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం..
జన్నారం డివిజన్‌లో నిఘా కోసం అటవీ చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతంలో కొంత పర్యవేక్షణ కొరవడింది. కానీ నేను విధుల్లో చేరినప్పటి నుంచి సీసీకెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. సిబ్బంది పనితీరు కనిపెడుతున్నాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.
– కారం శ్రీనివాస్, రేంజ్ అధికారి

కొరవడిన పర్యవేక్షణ!

కొరవడిన పర్యవేక్షణ!