
కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ నేతలు
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్/ఆదిలాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పౌర విమానయా న శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉ మ్మడి జిల్లాలోని జాతీయ రహదారులు, ఆది లాబాద్‌లో విమానయానం ఏర్పాటుపై చర్చించారు. బాసర నుంచి మహారాష్ట్రలోని మహోర్ వరకు హైవే అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నితిన్ గడ్కరీని కోరారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఉన్నారు.
5న నాగోబా దర్బార్‌హాల్‌లో చర్చా వేదిక
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం సమీపంలో గుర్తు తెలియని దుండగులు హీరాసుక స్మారక జెండా తొలగించిన విషయంపై ఈనెల 5న నాగోబా దర్బార్ హాల్‌లో చర్చా వేదిక నిర్వహించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ అన్నారు. గురువారం నాగోబా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ మేధావులు, ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు చర్చకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, మెస్రం బాదిరావ్ పటేల్, మెస్ర దుర్గు, మెస్రం ఆనంద్‌రావ్ తదితరులు ఉన్నారు.