
నేడు రాములోరి పెళ్లి..
● జిల్లాలో ముస్తాబైన ఆలయాలు ● భక్తుల కోసం ఏర్పాట్లు ● నేడు శ్రీరామనవమి
మంచిర్యాలఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి జిల్లాలోని కోదండ రామాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగే కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాలకు రంగులు వేసి మామిడి తోరణాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేశారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, వందేళ్లనాటి పాత మంచిర్యాల రామాలయం, శివాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల విశ్వనాథ స్వామి ఆలయం, గౌతమినగర్ కోదండరామాలయం, ఏసీసీ, గర్మిళ్ల హనుమాన్ టెంపుల్ తదితర ఆలయాల్లో కల్యాణం నిర్వహించనున్నారు. దండేపల్లిలో సీతారాముల కల్యాణంలో భాగంగా శనివారం హనుమాన్ దీక్షాపరులు, భక్తులు బ్యాండుమేళాలు, మంగళహారతులతో ఎడ్లబండ్లలో పాలపొరకను తీసుకొచ్చారు. రామాలయం వద్ద పందిళ్లపై పాలపొరకను వేసి పెళ్లి వేడుకలు ప్రారంభించారు.
మంచిర్యాలలోని ఆలయం వద్ద చలువ పందిళ్లు
మందమర్రిరూరల్: ఎంవీటీసీ పక్కన కల్యాణ వేదిక ఏర్పాట్లు

నేడు రాములోరి పెళ్లి..