
ఎస్టీపీపీ ఈడీగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) నూతన ఈడీగా చెన్నకేశవుల చిరంజీవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్టీపీపీ ఈడీగా చిరంజీవిని నియమిస్తూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఉత్తర్వులు జారీ చేశారు. చిరంజీవి ముందుగా ఎస్టీపీపీ మైసమ్మతల్లి ఆలయం, సీతారామచంద్రాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జీఎం శ్రీనివాసులు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాసులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏజీఎంలు ప్రసాద్, మురళీధర్, అజ్మీరాతుకారం, తదితరులు పాల్గొన్నారు.