
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కోటపల్లి: ప్రేమ విఫల మై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల మే రకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం రాము (23) ఇంటి వద్దే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. తాను ప్రేమించిన యువతి ప్రేమకు నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని తండ్రి బాపు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆదిలాబాద్‌లో పశువుల వ్యాపారి...
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఫిరోజ్ సిద్దిఖి (35) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. పశువుల వ్యాపారం చేస్తున్న ఫిరోజ్ సిద్దిఖికి నష్టం రావడంతో అప్పుల బాధ తాళలేక అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించగా మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
మనస్తాపంతో బాలిక..
ఇచ్చోడ: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు మండలంలోని ముకురా(బి)కి చెందిన రఫీక్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో గొడవలకు దిగేవాడు. దీంతో మనస్థాపానికి గురైన అతని కుమార్తె పిర్ధోసి (16) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. మృతిరాలి తల్లి జాబినాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చెక్‌బౌన్స్ కేసులో ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఏడాది జైలుశిక్షతో పాటు అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని స్థానిక సివిల్ కోర్టు జడ్జి కే.నిరోష మంగళవారం తీర్పునిచ్చారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎస్.పారిజాత మంచిర్యాలకు చెందిన గుమ్మి జగన్నాథ్‌రెడ్డి వద్ద రూ.12లక్షలు అప్పుగా తీసుకుంది. ఒప్పందం ప్రకారం పారిజాత చెక్కులను అందజేసింది. గడువు తీరిన తర్వాత చెక్కును స్థానిక ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో జగన్నాథ్‌రెడ్డి 2017లో కోర్టును ఆశ్రయించగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.