మన దేశంలో చాలామందికి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితో ఇండస్ట్రీలోకి వచ్చి, క్రేజ్ తెచ‍్చుకున్నవాళ్లు ఉన్నారు. అలా విదేశీ ప్రేక్షకుల్ని అలరించిన వాళ్లు ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి ఎవరైనా పేరు తెచ్చుకున్నారా? అని అడిగితే ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంలా ఓ నటుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి పుట్టి చైనాలో సూపర్‌స్టార్ అయ్యాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇంతకీ అతడెవరు? అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకెళ్లాడు?
సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో కసి, పట్టుదల, విషాదం లాంటి అంశాలు ఉంటాయి. ఈ మధ్య చైనీస్ స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో దేవ్ రాతూరి అనే భారతీయుడు గురించి పాఠంగా పెట్టారని తెలిసి అందరూ ఆశ‍్చర్యపోయారు. అయితే అతడు లైఫ్‌లో ఏం జరిగిందా అని సెర్చ్ చేస్తే బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. ఉత్తరాఖండ్ తెహ్రి గర్వాల్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో పుట్టిన దేవ్ రాతూరి ప్రస్తుతం చైనాలో సూపర్‌స్టార్, 20కి పైగా చైనీస్ మూవీస్- వెబ్ సిరీసుల్లో నటించాడు. అక్కడి స్టార్స్‌తో కలిసి పనిచేశాడు.
(ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?)
దేవ్ జర్నీ గురించి చెప్పాలంటే 1998 నుంచి మొదలుపెట్టాలి. బ్రూస్ లీని చూసి యాక్టర్ అవుదామనుకున్నాడు. దిల్లీలోని బంధువుల నుంచి ఇంటి నుంచి ముంబయికి పారిపోయాడు. అక్కడికి వెళ్లిన తర్వాత గానీ అసలు విషయం బోధపడలేదు. బాలీవుడ్‌లో నటుడు కావడం అనుకున్నంత ఈజీ కాదని రియాలిటీలో తెలిసొచ్చింది. 'నెలల పాటు జనాల్లో కూర్చోవడం, చప్పట్లు కొట్టడం, పరుగెత్తడం లాంటి రోల్స్ వచ్చాయి తప్పితే కెమెరాలో కనిపించే అవకాశం రాలేదు' అని దేవ్ రాతూరి అప్పటి సంగతులు చెప్పుకొచ్చాడు.
ఇక ముంబయిలో ఉంటే నటుడు కాలేమని ఫిక్స్ అయిన దేవ్ రాతూరి.. తిరిగి దిల్లీ వచ్చేశాడు. ఆరు నెలలపాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. డబ్బుల కోసం హోటల్ లో వెయిటర్ గా పనిచేశాడు. ప్లేట్స్ కడుగుతున్నా, టేబుల్స్ తుడుస్తున్నా.. బ్రూస్ లీ, చైనానే గుర్తొచ్చేవి. దీంతో 2005లో ఓ ఫ్రెండ్.. టికెట్ తీసి సహాయం చేయడంతో చైనా ఫ్లైట్ ఎక్కేసి, అక్కడ ల్యాండ్ అయ్యాడు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
కట్టుబట్టలతో చైనా వెళ్లిన దేవ్.. చేతులో డబ్బుల్లేక ఓ రెస్టారెంట్ లో దాదాపు ఏడేళ్లపాటు పనిచేశాడు. అలా వచ్చిన అనుభవంతో 2013లో చైనాలో ఓ హెటల్ ప్రారంభించాడు. ఇప్పుడవి కాస్త ఎనిమిది అయ్యాయి. బిజినెస్ లో బిజీ అయిపోయిన దేవ్.. నటన గురించి మర్చిపోయాడు. ఏదైనా మనది అని రాసుంటే, తిరిగి తిరిగి మన దగ్గరకే వస్తుందనే సామెతలా దేవ్ కి అదృష్టం తలుపుతట్టింది.
ఓసారి దేవ్ రెస్టారెంట్ కి వచ్చిన ఓ చైనీస్ దర్శకుడు.. లో బడ్జెట్ మూవీ కోసం లోకేషన్, యాక్టర్ ని వెతుకుతున్నానని మాటల మధ్యలో ఇతడితో చెప్పాడు. దీంతో తనలోని నటుడు ఉన్నాడనే విషయం గుర్తొచ్చింది. అదే సదరు దర్శకుడికి చెబితే.. ఓకే చెప్పాడు. అలా 2015లో చైనీస్ చిత్రాల్లో దేవ్ జర్నీ షురూ అయింది. ఇప్పటివరకు ప్రతినాయక తరహా పాత్రలు చేశాడు. వ్యోమగామి, మాస్టర్ చెఫ్, చిత్ర నిర్మాత లాంటి డిఫరెంట్ గెటప్స్ చేస్తూ నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇతడి లైఫ్ జర్నీ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఇండియా.. ఎక్కడ చైనా.. ఎక్కడ సినిమాలు.. హేట్సాఫ్ అని ప్రశంసిస్తున్నారు.
(ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment