రజనీకాంత్‌ బాటలో విజయ్‌ | Actor Vijay Follow Rajanikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ బాటలో విజయ్‌

Jun 5 2024 12:42 PM | Updated on Jun 5 2024 1:31 PM

Actor Vijay Follow Rajanikanth

రజనీకాంత్‌ బాటలో నటుడు విజయ్‌ నడుస్తున్నారా? ఇదే చర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటుడు రజనీకాంత్‌. అయితే ఇప్పుడు ఆ బిరుదుకు నటుడు విజయ్‌ ఎసరు పెట్టినట్లు ఇటీవల పెద్ద ప్రచారమే జరిగింది. తాజా సూపర్‌స్టార్‌ విజయ్‌ అంటూ వారీసు చిత్రం ప్రమోషన్‌ సమయంలో పెద్ద చర్చనే జరిగింది. విజయ్‌ చిత్రాలు జయాపజయాలకతీతంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఆ మధ్య విడుదలైన బీస్ట్‌ చిత్రం ప్లాప్‌ అయినా మంచి వసూళ్లనే సాధించింది. 

అదే విధంగా వారీసు చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా లాభాల బాటనే పడింది. ఇక సమీపకాలంలో వచ్చిన లియో చిత్రం పూర్తిగా విమర్శలను ఎదుర్కొన్నా ఇటు నిర్మాతకు, అటు బయ్యర్లకు లాభాలనే తెచ్చి పెట్టింది. కాగా ప్రస్తుతం విజయ్‌ తన 168వ చిత్రం గోట్‌లో నటిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ను విజయ్‌ పూర్తి చేశారు. తదుపరి 169వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని తరువాత ఆయన నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని విజయ్‌ పెట్టిన విషయం తెలిసిందే. 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీకి విజయ్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే నటుడు రజనీకాంత్‌ తరహాలో విజయ్‌ తాను నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత కొన్ని రోజులు విదేశీయానం చేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలా తాజా గోట్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్‌ ప్రస్తతం అమెరికాలో మకాం పెట్టారు. 

కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి తన 169వ చిత్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించనున్న ట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈయన గతంలో నటించిన గిల్లీ చిత్రం ఇటీవల రీరిలీజ్‌ అయ్యి భారీ వసూళ్లను సాధించింది. కాగా ఈ నెల 22 వ తేదీ విజయ్‌ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విజయ్‌ నటించిన మరో సూపర్‌హిట్‌ చిత్రం పోకిరిని రీరిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement