‍బాయ్‌ఫ్రెండ్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్! | Actress Malvika Raaj Married Her Boyfriend Pranav Bagga In Goa, Know Who Is He And Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Maalvika Raaj Marriage: ఆ తెలుగు హీరోయిన్‌కి గోవాలో గ్రాండ్‌గా పెళ్లి!

Published Thu, Nov 30 2023 5:50 PM | Last Updated on Fri, Dec 1 2023 4:03 PM

Actress Malvika Raaj Marriage Pics And Husband Details - Sakshi

ఇదేం వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వరుణ్ తేజ్-లావణ్య కొన్నిరోజుల ముందే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పలువురు సీరియల్, సినీ నటులు కూడా ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది.

(ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ)

ఈ బ్యూటీ పేరు మాళవిక రాజ్. బాలీవుడ్ హిట్ మూవీ 'కబీ ఖుషీ కభీ ఘమ్'లో కరీనా కపూర్ చిన్నప్పటి పాత్రలో ఈమె నటించింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వేరే చిత్రాల్లో నటించలేదు. వయసొచ్చాక 'కెప్టెన్ నవాబ్' అనే హిందీ మూవీతో పాటు 'జయదేవ్' అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్‌గా చేసింది. ఇవి కాకుండా 'స్క్వాడ్' అని మరో సినిమాలోనూ నటించింది. కానీ అదృష్టం కలిసి రాలేదు.

ఈ క్రమంలోనే సినిమాలు, యాక్టింగ్ లాంటివి పక్కనబెట్టేసిన మాళవిక.. కొన్నాళ్ల క్రితం ప్రేమలో పడింది. ఈ మధ్య నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంది. యువ పారిశ్రామికవేత్త ప్రణవ్ బగ్గా అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. గోవాలో తాజాగా ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇదంతా కూడా రహస్యంగానే జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అందరికీ పెళ్లి గురించి తెలిసింది. దీంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement