![Actress Shruti Das Gets Hitched to Director Swarnendu Samaddar - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/10/SRuthi-das%2Cswarna.jpg.webp?itok=S5ySk5Ni)
బెంగాలీ ఇండస్ట్రీలో ఓ ప్రేమజంట పెళ్లి పీటలెక్కింది. నటి శృతి, డైరెక్టర్ స్వర్ణేందు కొంతకాలంగా ప్రేమలో విహరిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. జూలై 9న ఎంతో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నవ వధువు శృతి మీడియాకు వెల్లడించింది. మా కల నిజమైంది. కొంతకాలంగా మేమిద్దరం కలిసే ఉంటున్నాం. సరైన సమయం చూసుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యాం. దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకోలేదు. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే మా పెళ్లి జరిగింది అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే బుల్లితెరపై సీరియల్స్ డైరెక్ట్ చేసే స్వర్ణేందు త్రినయని ధారావాహిక సమయంలో శృతిని కలిశాడు. ఈ సీరియల్‌తోనే శృతి బుల్లితెరకు పరిచయమైంది. ఈ సీరియల్ తెరకెక్కుతున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. తాజాగా వీరు జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుండటంతో ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చదవండి: జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. ఐశ్వర్య రాజేశ్‌ను గుర్తుపట్టారా?
Comments
Please login to add a commentAdd a comment