
ప్రతి ఏడాది బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో పెద్ద సినిమాల కన్నా చిన్న చిత్రాల జాబితానే పెద్దదిగా ఉంది. ఈ చిన్న సినిమాల ద్వారా ఎందరో నటీనటులు వెండితెరకు పరిచయమవుతుంటారు. అందులో కొందరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. మరికొందరు ఇక్కడ ఇమడలేక సినిమాలకు గుడ్‌బై చెప్తారు. ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్ ప్రయాణం.. టాలీవుడ్‌తోనే మొదలైంది. అయితే తనకు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చింది మాత్రం బాలీవుడే.. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రత్ కౌర్.
1997లో ముంబైలో పుట్టింది సిమ్రత్ కౌర్. 2017లో ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాతి ఏడాది పరిచయం అనే సినిమా చేసింది. అదే ఏడాది హిందీలో సోని అనే మూవీ చేసింది. రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న ఆమె 2020వ సంవత్సరంలో డర్టీ హరితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించినందుకు గానూ చాలామంది ఆమెను తిట్టిపోశారు. కానీ గదర్ 2 సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.691 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సిమ్రత్ కెరీర్‌లోనే ఈ మూవీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
చదవండి: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నన్ను తన గదికి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment