ఆ లక్ష్యం నెరవేరింది | Aditi Rao Hydari reveals the one person who inspired her to become an actress | Sakshi
Sakshi News home page

ఆ లక్ష్యం నెరవేరింది

Published Mon, Jan 18 2021 12:54 AM | Last Updated on Mon, Jan 18 2021 2:30 AM

Aditi Rao Hydari reveals the one person who inspired her to become an actress - Sakshi

‘‘ఎవరైనా నన్ను ‘మీరు ప్యాన్‌ ఇండియన్‌ యాక్టర్‌’ అని అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నటిగా ప్రారంభం అయినప్పుడు ప్యాన్‌ ఇండియా యాక్టర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతో వచ్చాను’’ అన్నారు అదితీ రావ్‌ హైదరీ. ఈ విషయం గురించి అదితీ రావ్‌ మాట్లాడుతూ – ‘‘నటి కావాలని కలలు కన్నాను. అది నిజం చేసుకున్నాను. కొన్నేళ్లుగా నా అభిమాన దర్శకులందరితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.

ఆ దర్శకులు తాము రాసుకున్న కథల్లో నేను సరిపోతాను అని నమ్మి నాకు ఆ పాత్రల్ని ఇవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అలానే అన్ని భాషల్లోని ప్రేక్షకులు నన్ను ఆదరించారు. వాళ్ల హీరోయిన్‌ అనుకున్నారు. అందుకే అన్ని భాషల ప్రేక్షకుల్ని పలకరించడానికి సినిమాల ఎంపిక విషయంలో బ్యాలెన్సింగ్‌గా ఉంటాను’’ అన్నారు. ప్రస్తుతం అదితీ రావ్‌ తెలుగులో శర్వానంద్‌తో ‘మహాసముద్రం’, హిందీలో జాన్‌ అబ్రహాంతో ఓ సినిమా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement