Akshay Kumar And Allu Arjun Working Together In Upcoming Movie - Sakshi
Sakshi News home page

Akshay Kumar: బన్నీతో అక్షయ్‌ సినిమా? నిజంగా హింటిచ్చాడా! లేక మామూలుగానే..

Published Thu, Jun 2 2022 5:51 PM | Last Updated on Thu, Jun 2 2022 7:43 PM

Akshay Kumar And Allu Arjun Working Together In Upcoming Movie - Sakshi

సౌత్‌ సినిమాలంటే బాలీవుడ్‌కు చిన్నచూపు ఉండేది.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు సౌత్‌ సినిమా రిలీజవుతుందంటే చాలు హిందీ సినిమాలు తమ రిలీజ్‌ డేట్స్‌ను వెనక్కు జరుపుతున్నాయి. బాహుబలి 1, 2, కేజీఎఫ్‌ 1, 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు సౌత్‌ ఇండస్ట్రీ ఖ్యాతిని చాటి చెప్పాయి. దీంతో బాలీవుడ్‌ స్టార్‌ సెలబ్రిటీలు సైతం మన హీరోలతో నటించాలని తహతహలాడుతున్నారు. తెలుగు సినిమాల్లో హిందీ సహా ఇతర భాష హీరోలు, హిందీ సినిమాల్లో తెలుగు హీరోలు కనిపించే ట్రెండ్‌ ఇప్పటికే మొదలైంది. అయితే త్వరలో బన్నీతో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది..

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పృథ్వీరాజ్‌. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌లో జూన్‌ 3న రిలీజవుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'దేశాన్ని విభజించి పాలించినట్లుగా సినిమా ఇండస్ట్రీని కూడా విభిజించి పిలవడం మానేయండి. ఇక్కడ సౌత్‌, నార్త్‌ అని తేడాల్లేవు.. ఉన్నది భారతీయ సినీ పరిశ్రమ ఒక్కటే. అన్ని ప్రాంతాల ప్రేక్షకుల కోసం అన్ని ఇండస్ట్రీలు కలిసి పని చేస్తున్నాయి. త్వరలో అల్లు అర్జున్‌ నాతో వర్క్‌ చేయవచ్చు, అలాగే నేను ఇంకో దక్షిణాది నటుడితోనూ పని చేయొచ్చు.. ముందుముందు జరిగేది ఇదే' అని చెప్పుకొచ్చాడు. అంటే బన్నీ, అక్షయ్‌ త్వరలో ఓ సినిమా చేయనున్న విషయాన్ని ముందే హింటిచ్చాడంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఆస్ట్రేలియా ఆఫర్‌, భారీ రెమ్యునరేషన్‌, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!
ఎఫ్‌ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement