Superstar Singer 2 Promo: Akshay Kumar Gets Emotional After Watching Rakshabandhan Video - Sakshi
Sakshi News home page

Akshay Kumar: అందరిముందే ఏడ్చేసిన స్టార్‌ హీరో!

Published Fri, Aug 5 2022 12:04 PM | Last Updated on Fri, Aug 5 2022 1:14 PM

Akshay Kumar Cant Hold Back Tears After Watching Raksha Bandhan Special Video - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ బుల్లితెరపై ప్రసారమయ్యే సూపర్‌స్టార్‌ సింగర్‌ రెండో సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా వెళ్లాడు. దీనికి సంబంధించిన ప్రోమోను సదరు ఛానల్‌ రిలీజ్‌ చేయగా ఇందులో అక్షయ్‌ కంటతడి పెట్టుకుంటూ కనిపించాడు. రక్షా బంధన్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌లో అందరూ అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే పాటలే పాడారు.

ఈ క్రమంలో అక్షయ్‌ తన సోదరితో కలిసి రాఖీ పండగ జరుపుకున్న ఫొటోలను సైతం స్క్రీన్‌పై ప్లే చేశారు. తన కష్ట సమయాల్లో అక్షయ్‌ అండగా నిలబడ్డాడని, కేవలం అన్నగానే కాకుండా ఓ తండ్రిగా, స్నేహితుడిగా సపోర్ట్‌నిచ్చాడంటూ తన అన్నను ఆకాశానికెత్తింది అతడి సోదరి. ఇది చూసిన అక్షయ్‌.. చెల్లెలు దేవి వచ్చాక మా జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని, మా బంధం అత్యంత విలువైనదని చెప్తూ ఎమోషనలయ్యాడు.

చదవండి: విజయ్‌ దేవరకొండతో లవ్‌? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక
 కమెడియన్‌ రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement