ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్ | Allu Arjun Video With His House Maid To Gain Instagram Followers, Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Video With House Maid: పనిమనిషికి బన్నీ చిన్న హెల్ప్.. సెల్ఫీ వీడియో వైరల్

Published Thu, Nov 30 2023 3:40 PM | Last Updated on Thu, Nov 30 2023 3:54 PM

Allu Arjun Video With His House Maid Viral - Sakshi

అల్లు అర్జున్ మళ్లీ ఫ్యాన్స్‌కి నచ్చేశాడు. సినిమాల పరంగా ఎలానూ ఎంటర్‌టైన్ చేస్తున్న బన్నీ..  ఇప్పుడు మరో క్యూట్ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాడు. ఈ వీడియోలో భాగంగా బన్నీ.. తన ఇంట్లో పనిచేసే ఓ అమ్మాయికి చిన్న సాయం చేశాడు. అది ఇప్పుడు అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.

(ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు మూవీ!)

'పుష్ప 2' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదే టైంలో ఓ అమ్మాయితో బన్నీ ఉన్న సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అయింది. అసలు ఇందులో ఏముందా అని చూస్తే.. ఆ అమ్మాయి అల్లు అర్జున్ ఇంట్లో పనిమనిషి అని తెలిసింది.

'నీకు బాగా ఫాలోవర్స్ రావాలని మంచి వీడియో తీస్తా సరేనా, ఎంతమంది ఫాలోవర్స్ కావాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?' అని బన్నీ అనగా.. ఆ అమ్మాయి 13k అని చెప్పింది. 'మినిమం ఎంత టచ్ అవ్వాలి?' అని బన్నీ అడగ్గా.. 30k అని ఆ అమ్మాయి చెప్పడం... ఈ వీడియోతో వస్తారా? అని అల్లు అర్జున్ అడగం క్యూట్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement