Ashu Reddy Slams On Trollers Over Comments About Pawan Kalyan And Her - Sakshi
Sakshi News home page

పిచ్చెక్కిపోయింది, నేను ఆ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు: అషూ

Published Sun, Mar 7 2021 12:42 PM | Last Updated on Sun, Mar 7 2021 3:28 PM

Ashu Reddy Slams Trollers Over Comments About Pawan Kalyan - Sakshi

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, నటి అషూ రెడ్డి మండిపడింది. పిచ్చి వార్తలు రాస్తే బాగోదంటూ హెచ్చరించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. "సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూస్తున్నాను. అన్నీ పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. నేను ముందే చెప్పాను. పవన్‌ కల్యాణ్‌ గారంటే నాకు దేవుడు అని! నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్‌ను. కానీ నా అభిమానాన్ని తీసుకెళ్లి సోషల్‌ మీడియాలో వేరేలా చెత్త చెత్తగా రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. పాజివిటీని వ్యాప్తి చేయాల్సిన వాళ్లే నెగెటివిటీని స్ప్రెడ్‌ చేస్తూ వేరే వాళ్లను బద్నాం చేయడం సరి కాదు"

"దీనివల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు అభిమానులను కలవొచ్చా? లేదా? అని ఆలోచించుకునే స్టేజీలోకి పవన్‌ కల్యాణ్‌ను నెడుతున్నారు. ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దు. కానీ నాకివి చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చూస్తున్నాను. దయచేసి పిచ్చిపిచ్చి రాతలు రాయకండి. ఎందుకంటే, నేను ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఒక మనిషికి అభిమాని అంటే చచ్చేంతవరకు అభిమానిలాగే ఉంటారు. అంతే తప్ప అక్కడ ఇంకేమీ అవదు. కానీ మీ రాతల వల్ల ఉన్న పేరు నాశనం చేయొద్దు" అని కాస్త ఘాటుగానే స్పందించింది.

కాగా అషూ రెడ్డి తన అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌ను కలిసిన ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆయనతో కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం, సంతోషంగా అనిపించిందని గాల్లో తేలిపోయింది. పైగా తనకో లెటర్‌ కూడా ఇచ్చాడంటూ దాని ఫొటోను సైతం అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో పవన్‌తో అషూ దిగిన ఫొటోలు వైరల్‌గా మారగా అతడికి నాలుగో భార్యగా ఉండేందుకు సిద్ధమైందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనిపై స్పందించిన అషూ తనెప్పటికీ అభిమానినేనంటూ ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది.

చదవండి: పవన్‌ సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి!

నా క్యారెక్టర్‌కు ఆ సీన్స్‌ లేవు: సలార్‌ భామ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement