Balakrishna Unstoppable Show With Ravi Teja And Gopichand Malineni, Promo Inside - Sakshi
Sakshi News home page

Balakrishna Unstoppable Show: అమ్మాయిలకు లైన్‌ వేసేవాడిని, బైకేసుకుని వెళ్లి...

Published Wed, Dec 22 2021 5:58 PM | Last Updated on Wed, Dec 22 2021 7:14 PM

Balakrishna Unstoppable Show With Ravi Teja And Gopichand Malineni, Promo Inside - Sakshi

Balakrishna Unstoppable: ఇద్దరు మాస్‌ హీరోలు కలిస్తే ఆ రచ్చే వేరు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. రవితేజ స్టేజీపైకి వచ్చీరావడంతోనే నీకూ నాకూ పెద్ద గొడవైందటగా అని బాలయ్య ప్రశ్నించగా పనీపాటా లేనివాళ్లు అలాంటి వార్తలు స్ప్రెడ్‌ చేస్తూనే ఉంటారని కౌంటర్‌ ఇచ్చాడు మాస్‌ హీరో.

'మొగల్రాజపురం అమ్మాయిలకు లైన్‌ వేస్తుండేవాడివట కదా' అని బాలయ్య కూపీ లాగేందుకు ప్రయత్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి తెగ ఇబ్బందిపడ్డాడు రవితేజ. దీంతో బాలయ్య ఓపెన్‌ అవుతూ.. 'తప్పేంటయ్యా.. మేమూ లైన్‌ వేసేవాళ్లం. రెడ్డి కాలేజీ దగ్గర చుట్టాలుండేవాళ్లు. వాళ్ల పేరు చెప్పుకుని కాలేజీ దగ్గరకు బైకులేసుకుని వెళ్లేవాళ్లం..' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో రవితేజతో పాటు గోపీచంద్‌ మలినేని​ కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ.. తాను డైరెక్టర్‌ కాకముందు సమరసింహారెడ్డి సినిమా వల్ల ఓసారి అరెస్ట్‌ అయ్యానని చెప్పడంతో బాలయ్య ఖంగు తిన్నాడు. మరి వీరి సరదా సంభాషణను చూడాలంటే డిసెంబర్‌ 31 వరకు ఆగాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement