తెలుగు సినిమాల్లో తెలంగాణ కల్చర్ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో బలగం, మేమ్ ఫేమస్, పరేషాన్.. ఇలా వెంటవెంటనే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాగానే ఎంటర్ టైన్ చేశాయి. ఇక ఈ లిస్టులోనే ఉన్న మరో చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. జూన్ నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)
కథేంటి?
తెలంగాణలో భీమదేవరపల్లి అనే పల్లెటూరు. ఉండేవాళ్లకు పెద్దగా చదువు రాదు. ఎవరైనా ఏదైనా చెబితే ఇట్టే నమ్మేస్తారు. ఇదే ఊరిలో జంపన్న(అంజి వల్గుమాన్) బ్యాంక్ అకౌంట్ లో ఓరోజు రూ.15 లక్షలు వచ్చిపడతాయి. ప్రభుత్వం తనకు ఈ డబ్బు ఇచ్చిందని, తనకున్న అప్పులన్నీ తీర్చేస్తాడు. దీంతో ఊరిలో వాళ్లందరూ ఇలా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ డబ్బు ఎవరివి? అనేది తెలియాలంటే 'భీమదేవరపల్లి బ్రాంచి' చూసేయాల్సిందే.
ఇప్పటికే స్ట్రీమింగ్
థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన ఈ సినిమా.. జనాలకు పెద్దగా తెలియకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి అంటే మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏదైనా కొత్త సినిమా చూద్దామనే ఆసక్తి ఉంటే దీన్ని ప్రయత్నించొచ్చు. అలానే ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అవేంటనేది కూడా కింద లింక్ చేసి చూసేయండి. మీ వీకెండ్‌ని ఫర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment